Rishab Shetty | కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘కాంతార: చాప్టర్ 1’ (Kantara: Chapter 1) సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా దాదాపు రూ.717 కోట్ల వసూళ్లను రాబట్టింది. రిషబ్ శెట్టి ఈ సినిమాలో కథానాయకుడిగా నటించగా.. రుక్మిణి వసంత్ కథానాయికగా నటించింది. జయరాజ్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమా ఇంతటి విజయం సాధించిన సందర్భంగా ఒక్కొక్క పాటను విడుదల చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే బ్రహ్మ కలశ పాటను విడుదల చేసిన మేకర్స్ తాజాగా రోమాంటిక్ సాంగ్ ‘మదన మన మోహిని’ పాటను మేకర్స్ విడుదల చేశారు.
విజయ్ ప్రకాష్, అనన్య భట్ ఆలపించిన ఈ గీతానికి బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూర్చగా, ప్రమోద్ మరవంతే లిరిక్స్ అందించారు. రిషబ్ షెట్టి, రుక్మిణి వాసంత్ జోడీ మధ్య ఆకర్షణీయమైన రొమాన్స్, ఈ పాటలోని సన్నివేశాలు ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి.