OG | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన తాజా మూవీ ‘ఓజీ’ . ఈ సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఈ మూవీ నుంచి హంగ్రీ చీతా ఫుల్ వీడియో సాంగ్ విడుదల అయింది. మాస్ బీట్ ర్యాప్ స్టైల్లో రూపొందించిన ఈ యాక్షన్-ఓరియెంటెడ్ థీమ్ సాంగ్, పవన్ అభిమానులకు విజువల్ ట్రీట్ అందిస్తోంది. ఈ పాటలో పవన్ కళ్యాణ్ పాత్ర ఇంటెన్సిటీ, పవర్ స్పష్టంగా వ్యక్తమవుతోంది. సంగీత దర్శకుడు తమన్ సమర్పించిన పవర్ ప్యాక్డ్, ఎనర్జిటిక్ మ్యూజిక్ అభిమానులను గూస్ బంప్స్కి గురి చేస్తుంది. సాంగ్‌లోని “నెత్తురుకు మరిగిన హంగ్రీ చీతా… శత్రువును ఎంచితే మొదలు వేట, డెత్ కోటా కన్ఫిర్మ్” వంటి లైన్స్ పాత్రలోని పవర్‌ను మరింత హైలైట్ చేస్తాయి.
వీడియోలో యాక్షన్ సీక్వెన్స్‌లు, స్టైలిష్ స్టైలింగ్, పవన్ కళ్యాణ్ ఎక్సప్రెషన్స్ ఫ్యాన్స్‌ని ఫుల్ ఎంటర్టైన్ చేస్తూ, విడుదలైన క్షణంలోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సాంగ్ ఓజీ సినిమా పై ఫ్యాన్స్ అంచనాలను మరింత పెంచింది. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఓజీ’ (They Call Him OG) ఓటీటీలోకి రాబోతుంది. రీసెంట్గా ఈ సినిమా ఓటీటీ డేట్‌ను నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్‌గా నిలవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోరుకునే వింటేజ్ యాక్షన్, స్టైలిష్ లుక్స్‌తో పాటు తమన్ సంగీతం, సుజీత్ టేకింగ్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. అయితే తాజాగా ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం అక్టోబర్ 23 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు పవన్ కల్యాణ్‌కు సంబంధించిన మరో క్రేజీ వార్త నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. ఈ సారి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో సినిమాకు ప్లాన్ చేస్తున్నాడట పవన్ కల్యాణ్. ఇంతకీ ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో కాదు లోకేశ్ కనగరాజ్.. అన్నీ అనుకున్నట్టు కుదిరితే పవన్ కల్యాణ్ నెక్ట్స్ చేయబోయే కొత్త సినిమా ఇదే కానుందట.