DiwaliParty | టాలీవుడ్లో దీపావళి పండుగ అనగానే వెంటనే గుర్తుకు వచ్చే పేర్లలో బండ్ల గణేష్ పేరు ప్రత్యేకిగా నిలుస్తుంది. సాధారణంగా బాలీవుడ్లోనే దీపావళి పార్టీలు ట్రెండ్‌గా ఉంటాయి. కానీ ఈసారి టాలీవుడ్లో కొత్త ట్రెండ్ సృష్టిస్తూ బండ్ల గణేష్ భారీ పార్టీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని తన జూబ్లీ హిల్స్ ఇంట్లో శనివారం రాత్రి బండ్ల గణేష్ దీపావళి పార్టీని ఇవ్వగా.. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక మెగాస్టార్‌తో పాటు విక్టరీ వెంకటేశ్, సిద్ధు జొన్నలగడ్డ, శ్రీకాంత్, రోషన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, తేజ సజ్జ, జేడీ చక్రవర్తి, తరుణ్, మౌలి, దర్శకుడు హరీశ్ శంకర్, నిర్మాత నవీన్ యెర్నేని తదితరులు కూడా వేడుకకు హాజరయ్యారు.
నిర్మాతగా, కామెడియన్‌గా ప్రసిద్ధి చెందిన బండ్ల గణేష్ తన స్పీచ్‌లతో ఎప్పుడూ హైలైట్స్ అవుతూ ఉంటారు. బండ్ల గణేష్ తన ప్రొడక్షన్ హౌస్ ‘పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్’ కింద ‘అంజనేయులు’, ‘గబ్బర్ సింగ్’ వంటి సినిమాలు నిర్మించారు. ఇటీవల కొత్త ప్రాజెక్టులతో కమ్‌బ్యాక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ పార్టీ ద్వారా మరోసారి అతని ఫ్రెండ్లీ నేచర్, హాస్యం అందరినీ ఆకట్టుకుంది.