హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఐటీ, పీఏఎం అండ్ లీగల్)గా సీనియర్ అధికారి ఎం రాజశేఖర్ బుధవారం బస్ భవన్లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్టీసీ ఐటీ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తామని, ప్రయాణికులకు టికెట్ బుకింగ్, లైవ్ బస్ ట్రాకింగ్ వంటి డిజిటల్ సేవలను మరింత మెరుగ్గా అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఆయనకు సిబ్బంది, ఇతర విభాగాల అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.