హైదరాబాద్ : తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్(M.K. Stalin )తన పదవికి రాజీనామా చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత, ఆయన గవర్నర్ రాజేంద్ర విశ్వనాథన్ అర్లేకర్‌కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆయన తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. కొళత్తూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీఎం స్టాలిన్ పరాజయం పాలయ్యారు. కాగా, రెండు చోట్ల పోటీ చేసిన విజయ్ గెలుపొందడం విశేషం.
మరోవైపు మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తం 234 స్థానాల్లో 107 సీట్లను గెలుచుకొని విజయ ఢంకా మోగించింది. అధికార డీఎంకే కూటమి 74 స్థానాలకు పరిమితమయ్యింది. ఈ నేపథ్యంలో టీవీకే చీఫ్ విజయ్(TVK Chief Vijay) ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
గవర్నర్‌కు లేఖ రాశారు. ఆయన అపాయింట్మెంట్ కోరారు. లోక్‌భవన్‌కు ఈమెయిల్ చేశారు. 108 స్థానాలతో టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవతరించినట్లు చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. అయితే సభలో తమ మెజారిటీని నిరూపించుకునేందుకు మరింత గడువును ఇవ్వాలని విజయ్ తన లేఖలో కోరినట్లు తెలుస్తోంది.