అచ్చుగుద్దినట్టు చందమామ లాంటి లగ్జరీ హోటల్‌ను దుబాయ్‌లో నిర్మించనున్నారు. దూరం నుంచి చూస్తే నిజంగానే చంద్రుడు నేలపై వాలాడా అన్నంత రియల్‌గా రూపుదిద్దనున్నారు.
కెనడాకు చెందిన ఆర్కిటెక్చరల్ కంపెనీ మూన్ వరల్డ్ రిసార్ట్స్.. ఈ ‘మూన్ దుబాయ్’ హోటల్‌ను నిర్మించేందుకు ప్రతిపాదనలు చేసింది. 735 అడుగుల ఎత్తుతో ఈ నిర్మాణాన్ని 48 నెలల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారు.