ముంబై : కఠిన చట్టాలు తీసుకువచ్చినా మహిళలు, బాలికలు, చిన్నారులపై లైంగిక దాడులకు బ్రేక్ పడటం లేదు. దేశ వాణిజ్య రాజధానిలో దారుణం వెలుగుచూసింది. బాలికకు చాక్లెట్ ఆశచూపిన టెంపో డ్రైవర్ (35) నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ముంబైలోని ఘట్కోపల్లో మంగళవారం జరిగింది.
నిందితుడిని ముంబై పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒంటరిగా ఉన్న బాలికకు చాక్లెట్ ఇస్తానని నమ్మబలికిన నిందితుడు ఆమెను నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడి పరారయ్యాడు. బాలిక ఏడుస్తుండగా అటుగా వెళుతున్న వ్యక్తి గమనించి పోలీసులకు సమాచారం అందించాడు.
పోలీసులు ప్రశ్నించగా బాలిక జరిగిన విషయం వెల్లడించింది. పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి 24 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేశారు. పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.