ఆమె జీతం తక్కువ.. ఐటీ సహా 80 రంగాల్లో తప్పని వివక్ష
ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం.. అన్నింటా సమానత్వం అంటూ మహిళలు హక్కుల కోసం గొంతెత్తుతున్నారు. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా సత్తా చాటుతున్నారు. కొన్ని రంగాల్లోనైతే మహిళలే మహరాణులుగా విరాజిల్లుతున్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, ఐటీ నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు కీలక పాత్ర పోషిస్తున్నారు.
- ఉద్యోగుల వేతనాల్లో అసమానతలు
- మహిళా ఎంప్లాయీస్‌కు తక్కువ జీతం
- దేశంలో 20% పైగా ‘పే’ గ్యాప్స్
- హైదరాబాద్‌లో 59 శాతం వ్యత్యాసం
- నౌకరీ తాజా అధ్యయనంలో వెల్లడి
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం.. అన్నింటా సమానత్వం అంటూ మహిళలు హక్కుల కోసం గొంతెత్తుతున్నారు. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా సత్తా చాటుతున్నారు. కొన్ని రంగాల్లోనైతే మహిళలే మహరాణులుగా విరాజిల్లుతున్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, ఐటీ నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ సమాజంలో అసమానతలు ఎదుర్కొంటూనే ఉన్నారు. తాజాగా జరిగిన ఓ సర్వేలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఐటీతోపాటు 80కి పైగా రంగాల్లో మహిళా ఉద్యోగుల జీతాలు పురుషుల కంటే తక్కువగా ఉన్నట్టు ప్రముఖ జాబ్ ప్లాట్‌ఫాం ‘నౌకరీ’ సంస్థ సర్వేలో స్పష్టమైంది. దేశవ్యాప్తంగా 8 నగరాల్లో.. వివిధ రంగాల్లో పనిచేసే 20 వేల మంది ఉద్యోగులను నౌకరీ సంస్థ సర్వే చేసి, వివరాలను విడుదల చేసింది. మహిళా ఉద్యోగుల్లో 45శాతం మందికి పురుషుల కంటే సగటున 20 శాతం జీతం వ్యత్యాసం ఉన్నట్టు తెలిపింది.
ఏ నగరం చూసినా ఏమున్నది!
మహిళా ఉద్యోగుల జీతాల అసమానతలో ఐటీ రంగం (56%) మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఫార్మా (55%), ఆటోమొబైల్ (53%), రియల్ఎస్టేట్ (21%), ఎఫ్ఎంసీజీ (18%), బ్యాంకింగ్(12%) రంగాలు నిలిచాయి. దేశంలోనే టెక్నాలజీ హబ్ నగరాలైన హైదరాబాద్, బెంగళూరు మహిళా ఉద్యోగుల జీతాల్లో అసమానతలతో మొదటి, రెండు స్థానాల్లో నిలిచాయి. మహిళా ఉద్యోగుల్లో 59 శాతం అసమానతలతో హైదరాబాద్ టాప్‌లో నిలువగా.. 58 శాతంతో బెంగళూరు ఆ తర్వాతి స్థానంలో నిలిచింది.
అసమానతలకు కారణాలేంటి?
మహిళా ఉద్యోగులకు జీతాలు ఎందుకు తక్కువ ఉన్నాయనే కారణాలపైనా నౌకరి సంస్థ సర్వేలో దృష్టి పెట్టింది. ప్రసూతి సెలవులు తీసుకోవడం అసమానతలకు ప్రధాన కారణమని 51 శాతం మంది వివిధ రంగాలకు చెందిన ప్రొఫెషనల్స్ అభిప్రాయపడ్డారు. పని ప్రదేశాల్లో అసమానతలు కారణమని 27 శాతం మంది తెలిపారు. మెటర్నిటీ బ్రేక్ కారణంగా 5-10 ఏండ్ల ఉద్యోగ అనుభవమున్న మహిళా ఉద్యోగుల్లో 54 శాతం, 10-15 ఏండ్ల అనుభవమున్న మహిళా ఉద్యోగుల్లో 53 శాతం వేతనాల్లోనూ వ్యత్యాసం ఉండటం ఆందోళన కలిగిస్తున్నదని కెరీర్ ఎక్స్పర్ట్స్ తెలిపారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వాళ్లు, 1-2 ఏండ్ల అనుభవమున్న ఉద్యోగుల జీతాలను పురుషులతో జీతాలతో పోల్చి చూస్తే 53 శాతం మందిలో ‘పే గ్యాప్స్’ ఉన్నట్టు అధ్యయనం పేర్కొంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

