పెద్దపల్లి, జూలై 22: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి- కూనారం ఆర్వోబీ వద్ద రైల్వే పట్టాలపై లారీ నిలిచిపోవడంతో కాసేపు హైటెన్షన్ నెలకొన్నది. బుధవారం రాత్రి కాల్వ శ్రీరాంపూర్ మండలం మంగపేట నుంచి ఏపీకి ధాన్యం లోడ్‌తో వెళ్తున్న లారీ పెద్దపల్లి – కూనారం ఆర్వోబీ వద్దకు వచ్చింది.
రైలు పట్టాల మధ్య ఎగుడు దిగుడు ఉండటం, లారీ అధికలోడ్‌తో ఉండటం వల్ల ముందుకు కదల్లేకపోయింది. వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తమై పలు రైళ్లను నిలిపివేశారు. క్రేన్ సాయంతో పట్టాలపై నుంచి లారీని ముందుకు తీసుకెళ్లారు.