జనగామ, మే 11 (నమస్తే తెలంగాణ) : ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద లోడింగ్, అన్‌లోడింగ్‌లో తీవ్ర జాప్యం.. అధికారులు వెంటవెంటనే లోడింగ్‌కు ఒత్తిడి తెస్తుండటంతో మనస్తాపం చెందిన ఓ లారీ యజమాని ఆత్మహత్యకు యత్నించిన ఘటన సోమవారం జనగామ వ్యవసాయ మార్కెట్ సమీపంలో కలకలం రేపింది. ఆరురోజుల క్రితం జనగామ వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన చీటకోడూరు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో బస్తాల లోడింగ్.. అన్లోడింగ్ కోసం లారీని పెట్టాడు.
ధాన్యం లోడింగ్.. అన్లోడింగ్ కోసం ఒక్కో వాహనానికి ఆరురోజుల సమయం పడుతున్నా.. ప్రభుత్వం కేవలం రెండురోజుల కిరాయి మాత్రమే చెల్లించి.. మిగిలిన నాలుగు రోజులు వెయిటింగ్ చార్జి పేరిట అతితక్కువ డబ్బులు చెల్లిస్తున్నది. ఆదివారం అన్లోడింగ్ పూర్తికాగా లారీని మళ్లీ లోడింగ్‌కు పెట్టాలని అధికారులు ఒత్తిడి తేవడంతో కలత చెంది బషీర్ సోమవారం మార్కెట్ సమీపంలోని లారీ అ డ్డాలో ఉరివేసుకునే ప్రయత్నం చేశాడు. స్థానిక హమాలీ రాజు అప్రమత్తమై అడ్డుకుకొని అధికారులకు సమాచారమిచ్చాడు.