మాల్, ఏప్రిల్ 30 : లారీ కారు ఢీకొని ఒకరు మృతి చెందగా ఇద్దరికీ తీవ్ర గాయాలైన సంఘటన మాల్ మండల పరిధిలోని దేవుళ్లతండా సమీపంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లేపల్లి నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ.. హైదరాబాద్ నుండి మల్లేపల్లి వెళ్లున్న కారు ఎదురెదురుగా ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్ఐ ముత్యాల రామ్మూర్తి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయాలైన ఇద్దరిని చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.