Shivdhar Reddy | యువ పోలీస్ అధికారులు డిపార్ట్మెంట్కు మంచి పేరు తీసుకురావాలి : డీజీపీ శివధర్ రెడ్డి
రాష్ట్ర డీజీపీ బి. శివధర్‌రెడ్డికి తెలంగాణ పోలీస్ అకాడమీలో ఘనమైన వీడ్కోలు లభించింది.
హైదరాబాద్ : రాష్ట్ర డీజీపీ బి. శివధర్‌రెడ్డికి(Shivdhar Reddy) తెలంగాణ పోలీస్ అకాడమీలో ఘనమైన వీడ్కోలు లభించింది. గురువారం ఆయన రిటైర్డ్ అవుతున్న సందర్భంగా పోలీస్ అధికారులు ఆయనకు గౌరవ వందనం (Farewell Parade) సమర్పించారు. ఈ సందర్భంగా శివధర్ రెడ్డి మాట్లాడుతూ..32 ఏళ్లు సుదీర్ఘకాలంలో ఎన్నో అనుభవాలు, అనుభూతులు మిగిలాయన్నారు. వృత్తిలో భాగంగా పలు సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. పోలీసింగ్ విధానంలో నేడు అనేక మార్పులు చోటు చేసుకున్నాయని, యువ పోలీస్ అధికారులు డిపార్ట్మెంట్కు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. పోలీస్ విభాగం పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ముందుకు వెళ్లాలని సూచించారు.
ప్రస్తుత సిటిజన్స్‌కు ఫ్రెండ్లీ పోలీసింగ్ అవసరమన్నారు. సర్వీసులో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా, పదవీ విరమణ పొందిన శివధర్ రెడ్డికి నూతన డీజీపీగా నియామకమైన సీవీ ఆనంద్ అభినందనలు తెలిపారు. ఆయన ఉద్యోగ జీవితంలో ఎన్నో సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొని పలు సంస్కరణలు తీసుకొచ్చారని ప్రశంసిచారు. తన సూచనలు, సలహాలు తీసుకునేందుకు తాను సిద్ధమేనని సీవీ ఆనంద్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

