Rafael Nadal | టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్ జీవితంపై డాక్యుమెంటరీ రాబోతుంది. రాఫెల్ అసాధారణ క్రీడా ప్రస్థానాన్ని, ఆయన జీవితంలోని ఆఖరి ఘట్టాలను ఆవిష్కరిస్తూ నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ రూపొందించగా.. తాజాగా దీనికి సంబంధించిన స్ట్రీమింగ్ తేదీని చిత్రబృందం వెల్లడించింది. రాఫా అనే టైటిల్‌తో రాబోతున్న ఈ డాక్యుమెంటరీ మే 29 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
ఆస్కార్ నామినీ జాకరీ హీన్జర్లింగ్ దర్శకత్వంలో నాలుగు ఎపిసోడ్లుగా రానున్న ఈ సిరీస్, ప్రధానంగా నాదల్ కెరీర్‌లోని చివరి ఏడాది (2024), ఆయన ఎదుర్కొన్న తీవ్రమైన గాయాలు, తండ్రిగా ఆయన కొత్త బాధ్యతలు మరియు రిటైర్మెంట్ నిర్ణయం వెనుక ఉన్న భావోద్వేగాల చుట్టూ సాగుతుంది. A life beyond limits అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో విడుదలైన పోస్టర్లు కోర్టులో ఆయన పట్టుదలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ డాక్యుమెంటరీలో నాదల్ చిరకాల ప్రత్యర్థులు మరియు స్నేహితులైన రోజర్ ఫెడరర్, నోవాక్ జోకోవిచ్ మరియు జాన్ మెకెన్రోల ప్రత్యేక ఇంటర్వ్యూలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చే ఈ డాక్యుమెంటరీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెన్నిస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
“To reach the top, you have to go near the limit.” – @RafaelNadal
The documentary series Rafa premieres May 29. pic.twitter.com/mvTY9rx0xn
— Netflix (@netflix) April 29, 2026