కోల్‌కతా : జగన్నాథుడి రథ చక్రాలుగా సుఖోయ్-30 యుద్ధ విమాన టైర్లను వినియోగించనున్నారు. కోల్‌కతాలోని జగన్నాథ ఆలయ నిర్వాహక సంస్థ ఇస్కాన్ ఈ విషయాన్ని వెల్లడించింది. గతంలో స్వామివారి రథానికి బోయింగ్ విమాన టైర్లను వినియోగించేవారు. అయితే గత 15 ఏండ్లుగా వీటిని కొనుగోలు చేయడం ఇస్కాన్‌కు సాధ్యపడలేదు.
జగన్నాథుడి రథానికి అనువైన టైర్ల కోసం అప్పటి నుంచి ఇస్కాన్ అన్వేషిస్తున్నది. సుఖోయ్-30 యుద్ధ విమాన టైర్లను వినియోగించాలని నిర్ణయించింది. సుఖోయ్ బృందం రథాన్ని పరిశీలించి దానికి అనువైన టైర్లను తయారు చేసి ఇచ్చింది. దీంతో సుఖోయ్ టైర్లు కలిగిన రథ చక్రాలపై జగన్నాథుడు కోల్‌కతా వీధుల్లో ఊరేగనున్నాడు.