Dire Wolves | అమెరికా శాస్త్రవేత్తల ఘనత.. భయంకరమైన తోడేళ్లకు మళ్లీ జీవం..!
అమెరికా శాస్త్రవేత్తలు అద్భుతం చేశారు. 12,500 ఏండ్ల కిందట అంతర్థానమైపోయిన జీవులను మళ్లీ సృష్టించారు. జన్యు మార్పిడి ప్రక్రియ ద్వారా 12 వేల సంవత్సరాల కిందట భూమిపై తిరగాడిన డైర్ వోల్ఫ్‌లకు (భయంకరమైన తోడేళ్లు) మళ్లీ ప్రాణం పోశారు. టెక్సాస్‌కు చెందిన కొలొసస్ బయోసైన్సెస్ సంస్థ వీటికి మళ్లీ ప్రాణం పోసింది.
- 12 వేల ఏండ్ల కిందటే అంతర్థానం
- జన్యు మార్పిడి ద్వారా పునర్జన్మ
- అమెరికా శాస్త్రవేత్తల అద్భుతం
టెక్సాస్, ఏప్రిల్ 8 : అమెరికా శాస్త్రవేత్తలు అద్భుతం చేశారు. 12,500 ఏండ్ల కిందట అంతర్థానమైపోయిన జీవులను మళ్లీ సృష్టించారు. జన్యు మార్పిడి ప్రక్రియ ద్వారా 12 వేల సంవత్సరాల కిందట భూమిపై తిరగాడిన డైర్ వోల్ఫ్‌లకు (భయంకరమైన తోడేళ్లు) మళ్లీ ప్రాణం పోశారు. టెక్సాస్‌కు చెందిన కొలొసస్ బయోసైన్సెస్ సంస్థ వీటికి మళ్లీ ప్రాణం పోసింది. ఆరు నెలల వయసున్న రొములస్, రెముస్ ఇప్పటికే నాలుగు అడుగుల పొడవు, 36 కిలోల బరువు ఉండటం విశేషం. ఈ మేరకు ‘సీఎన్ఎన్’లో కథనం ప్రచురితమైంది. ఈ జీవులు ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ సిరీస్‌లో పాపులర్. టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది.
మూడు జీవులకు ప్రాణం..
డైర్ వోల్ఫ్ అనేవి భయంకరమైన వేటాడే జంతువులు. చాలా ఎత్తు ఉండే ఇవి ఉత్తర అమెరికాలో జీవించేవి. అంతర్థానమైపోయిన ఓల్ఫ్ డీఎన్ఏ, వీటిని పోలి ఉండే గ్రే వోల్ఫ్ డీఎన్ఏల క్లోనింగ్, జన్యు మార్పిడి ద్వారా వీటికి తిరిగి ప్రాణం పోశారు. ఇవి గ్రే వోల్ఫ్ కంటే చాలా పెద్దవి. అంతేకాదు, మందమైన ఉన్నితో పాటు వేటాడేందుకు వీలుగా దృఢమైన దవడ కలిగి ఉండేవి. 13 వేల ఏండ్ల కిందటి పన్ను, 72 వేల ఏండ్ల కిందటి పుర్రెల ద్వారా తమ శాస్త్రవేత్తల బృందం డీఎన్ఏలను సేకరించి, పరిశోధనలు జరిపినట్టు కొలొసల్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో బెన్ లామ్ వెల్లడించారు. 2024 అక్టోబర్ 1న రెండు మగ ఓల్ఫ్లు, 2025 జనవరి 30న ఒక ఆడ వోల్ఫ్‌కు పరిశోధకులు ప్రాణం పోశారు. ప్రస్తుతం జీవించి ఉన్న ఇతర జాతుల తోడేళ్లతో పోలిస్తే వీటి ప్రవర్తన కాస్త భిన్నంగా ఉందని వారు పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

