కొవిడ్ ఎఫెక్ట్.. ర్యాలీలు, నిరసనలపై నిషేధం

బెంగళూరు : కొవిడ్ కేసుల పెరుగుదలతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నది.. వచ్చే 15 రోజుల పాటు రాష్ట్రంలో ర్యాలీలు, నిరసనలపై నిషేధం విధించింది. ఈ మేరకు సీఎం యడ్యూరప్ప ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్ పరిస్థితిపై ఆరోగ్యశాఖ అధికారులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా లాక్డౌన్ విధించేది లేదని స్పష్టం చేశారు. వైరస్ కట్టడికి ర్యాలీలు తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. కొవిడ్ నిబంధనలు పాటించాలని, రద్దీని నివారించాలని ఈ సందర్భంగా ప్రజలకు యడ్యూరప్ప విజ్ఞప్తి చేశారు.
కొవిడ్ పరిస్థితిని పరిశీలన, నియంత్రణకు ఎనిమిది జోన్లకు ఐఏఎస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. నిబంధనలు అమలులో ఉన్నప్పటికీ వివాహ కార్యక్రమాలకు హాజరయ్యే వారి సంఖ్యను నియంత్రించేందుకు ప్రభుత్వం కష్టపడుతుందని ఆ రాష్ట్ర రెవెన్యూ మంత్రి అశోక తెలిపారు. మార్గదర్శకాలు పాటించకపోతే మండపాల నిర్వాహకులకు భారీ జరిమానాలు విధించడంతో పాటు ఆరునెలలు మూసివేయనున్నట్లు హెచ్చరించారు. సోమవారం కర్ణాటకలో 2,792 కొవిడ్ పాజిటివ్ కేసులు, ఆరు మరణాలు నమోదయ్యాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

