e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home News బీడ్‌ జిల్లాలో ఈ నెల 26 నుంచి లాక్‌డౌన్

బీడ్‌ జిల్లాలో ఈ నెల 26 నుంచి లాక్‌డౌన్

బీడ్‌ జిల్లాలో ఈ నెల 26 నుంచి లాక్‌డౌన్

ముంబై : రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు అప్రమత్తమవుతున్నది. ఇప్పటికే పలు జిల్లాల్లో లాక్‌డౌన్‌ అమలు చేస్తుండగా.. తాజాగా బీడ్‌ జిల్లాలో లాక్‌డౌన్‌ను ప్రకటించింది. ఈ నెల 26వ తేదీ నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు జిల్లాలో లాక్‌డౌన్‌ అమలులో ఉండనుంది. వైరస్‌ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సమయంలో హోటళ్లు, రెస్టారెంట్లు, కల్యాణ మండపాలు, పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేటు కార్యాలయాలు అన్ని మూసివేయనున్నారు. ప్రైవేటు ఉద్యోగులకు ఇంటి పని చేయాలని సూచించారు. కిరాణాలు, పాలు, ఇతర అత్యవసరమైన దుకాణాలకు మినహాయింపును ఇచ్చారు. మంగళవారం మహారాష్ట్ర వ్యాప్తంగా 28వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గతేడాది డిసెంబర్‌ తర్వాత మొదటిసారిగా 132 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కేసులు 25 లక్షలు మార్క్‌ను దాటాయి. వైరస్ ప్రభావంతో మొత్తం 53,589 మంది మరణించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బీడ్‌ జిల్లాలో ఈ నెల 26 నుంచి లాక్‌డౌన్
బీడ్‌ జిల్లాలో ఈ నెల 26 నుంచి లాక్‌డౌన్
బీడ్‌ జిల్లాలో ఈ నెల 26 నుంచి లాక్‌డౌన్

ట్రెండింగ్‌

Advertisement