హైదరాబాద్, అక్టోబర్ 26( స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): మధ్యప్రదేశ్ బీజేపీలో నాగదా ఖాచరోద్ అసెంబ్లీ స్థానానికి టికెట్ లభించక పోవడంతో స్థానిక నేత లోకేంద్ర మెహతా తిరుగుబావుటా ఎగురవేశారు. బీజేపీ తనను మోసం చేసిందని ఆరోపించారు.
స్వతంత్ర అభ్యర్థిగా ఆయన నామినేషన్ వేశారు. 25 ఏండ్లుగా పార్టీ కోసం పని చేస్తున్నానని, పార్టీ అభివృద్ధికి రాత్రిపగలు కష్టపడి పనిచేశానని, ముక్కుమొహం తెలియని వారికి టికెట్లిచ్చారని ఆరోపించారు.