హైదరాబాద్: ఓ చెరువులో నీళ్లు తాగుతున్న సింహాన్ని.. ఆ నీటిలో ఉన్న బుల్లి తాబేలు ఆటపట్టించింది. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు ఇన్స్టాలో హల్చల్ చేస్తోంది. ఫైనెస్ట్ ఆఫ్ వరల్డ్ పేజీలో పోస్టు అయిన ఆ వీడియోకు ఇప్పటికే 4 లక్షల లైక్లు కూడా వచ్చేశాయి. నది ఒడ్డున నీళ్లు తాగేందుకు వచ్చిన ఓ సింహానికి తాబేలు జలక్ ఇచ్చింది. సింహాం మూతి వద్ద ఓ బుల్లి తాబేలు ప్రత్యక్షం కావడంతో కాస్త జంకిన ఆ మృగరాజు పక్కకు జరిగింది. మళ్లీ నీళ్లు తాగే ప్రయత్నం చేస్తున్న సమయంలో నీటిలో ఉన్న తాబేలు మరోసారి సింహాం నోటి దగ్గరకు వెళ్లింది. తీవ్ర దాహాన్ని తీర్చుకుంటున్న సింహాన్ని తాబేలు ఆటపట్టించిన తీరుపై ఆన్లైన్లో కామెంట్లు హోరెత్తుతున్నాయి. ఆ వీడియోను మీరూ చూడండి.