e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, December 8, 2021
Home News Little Amal | ఇంగ్లాండ్‌లో‘లిటిల్‌ అమల్‌'

Little Amal | ఇంగ్లాండ్‌లో‘లిటిల్‌ అమల్‌’

సిరియా అంతర్గత సంక్షోభం కారణంగా లక్షలాది బాలలు శరణార్థులుగా మారారు. వలస బాట పట్టారు. ఈ క్రమంలో వారికి ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. దీనిపై ప్రపంచ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఓ కళాకారుల బృందం ‘లిటిల్‌ అమల్‌’ అనే బొమ్మను సృష్టించింది. దీని ఎత్తు 11 అడుగులు. అమల్‌ అంటే అరబ్బీలో ‘ఆశ’. ఈ భారీ కీలుబొమ్మ జులై 27న సిరియా టర్కీ సరిహద్దుల్లోని గాజియాంటెప్‌లో తన ఐరోపా యాత్రను మొదలుపెట్టింది. గ్రీస్‌, ఇటలీ, స్విట్జర్లాండ్‌, జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్‌ దేశాలగుండా దాదాపు 8,000 కిలోమీటర్లు ప్రయాణించి అక్టోబర్‌ 20న ఇంగ్లాండ్‌ చేరుకుంది. కెంట్‌ నగరంలోని ఫోక్‌స్టోన్‌లో చిన్నారుల కేరింతల మధ్య నటుడు జూడ్‌ లా ఆహ్వానం పలికాడు. లిటిల్‌ అమల్‌ను ముగ్గురు కళాకారులు నడిపిస్తున్నారు. మొత్తం 14 వారాల యాత్రను పూర్తిచేసుకొని చివరగా నవంబర్‌ 3న మాంచెస్టర్‌ చేరుకుంటుంది.
మాంచెస్టర్‌లో అమల్‌ నడక ముగిసిపోతుంది. దారిపొడవునా ప్రదర్శనలు, సమావేశాలు,
వర్క్‌షాపులు నిర్వహిస్తూ సాగింది.. లిటిల్‌ అమల్‌ యాత్ర. రోమ్‌లో అయితే ఏకంగా పోప్‌ ఫ్రాన్సిస్‌ ఈ కీలుబొమ్మకు ఆహ్వానం పలికారు. అక్టోబర్‌ 24, ఆదివారం నాడు లండన్‌లో
లిటిల్‌ అమల్‌ తన జన్మదినం జరుపుకోనుంది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement