Man Kills Wife | భార్యను నరికి చంపి.. తలను ఫ్రిజ్లో దాచిన భర్త
Man Kills Wife | పెళ్లైన కొన్ని నెలలకే ఒక వ్యక్తి తన భార్యను నరికి చంపాడు. ఆమె చేతి వేళ్లు సగానికి నరికాడు. తెగిన తలను ఫ్రిజ్లో దాచి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడాన్ని గమనించిన పొరుగువారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
గువాహతి: పెళ్లైన కొన్ని నెలలకే ఒక వ్యక్తి తన భార్యను నరికి చంపాడు. ఆమె చేతి వేళ్లు సగానికి నరికాడు. తెగిన తలను ఫ్రిజ్లో దాచి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడాన్ని గమనించిన పొరుగువారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. (Man Kills Wife) అస్సాం రాజధాని గువాహతిలో ఈ సంఘటన జరిగింది. కొత్తగా పెళ్లైన జంట ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. గత రెండు రోజులుగా పొరుగువారికి వారు కనిపించలేదు. ఆ దంపతుల ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయి.
కాగా, సెప్టెంబర్ 6న ఆ అపార్ట్మెంట్ నుంచి దుర్వాసన రావడాన్ని పొరుగువారు గమనించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకున్నారు. అపార్ట్మెంట్ లాక్ బ్రేక్ చేసి లోపలకు వెళ్లి చూశారు. మహిళ మృతదేహం ఛిద్రమైన స్థితిలో కనిపించడంతో షాక్ అయ్యారు. ఆమె చేతి వేళ్లు సగం వరకు నరికి ఉన్నాయి. మృతదేహం కుళ్ళిపోవడం మొదలైంది. తొలుత ఆ మహిళ తల కనిపించలేదు. పోలీసులు ఇంట్లో సోదా చేయగా రిఫ్రిజిరేటర్లో దాచిన ఒక పాలిథిన్ బ్యాగ్లో ఆమె తల లభించింది.
మరోవైపు హతురాలిని 25 ఏళ్ల రియా తాలుక్దార్గా పోలీసులు గుర్తించారు. తెగిన తలతో సహా ఆమె మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. ఆ మహిళ భర్త ఆచూకీ ఎక్కడా లభించలేదు. శుక్రవారం అతడ్ని చివరిసారి చూసినట్లు పొరుగువారు తెలిపారు.
అయితే ఆదివారం రాత్రి రియా భర్త పోలీసులకు లొంగిపోయాడు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు గల కారణాలు గానీ, నిందితుడు లొంగిపోవడానికి దారితీసిన పరిస్థితుల గురించి గానీ పోలీసులు ఇంకా వెల్లడించలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Chops Fingers
- Fridge
- Guwahati
- Kills
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
Obsession | రూ.2500 కోట్లకు పైగా వసూళ్లు.. ఓటీటీలోకి రాబోతున్న ‘అబ్సెషన్ అన్కట్ వెర్షన్’
Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్కు ఓటేసిన బాలెన్ షా..!
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
Supreme Court | హిందూయిజం నుంచి ఇస్లాంకు మారితే బీసీ రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

