నారాయణపేట : ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ( Congress Promises ) అమలు చేయాలని కోరుతూ నారాయణపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ( BRS ) నాయకులు కలెక్టరేట్ వరకు డప్పు వాయిద్యాలతో ర్యాలీ ( Rally ) నిర్వహించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలను వెంటనే అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ మేరకు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.

బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ హామీలను అమలు చేయాలేని కాంగ్రెస్ను తొలగించి తెలంగాణకు కాపాడుకోవాలని పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ విధానాలతో అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.