Lionel Messi : అర్జెంటీనా ప్లేయర్ లియోనల్ మెస్సీ(Lionel Messi)కి చైనాలో ఊహించని పరిస్థితి ఎదురైంది. పాస్‌పోర్టు తారుమారు కావడంతో బీజింగ్ విమానాశ్రయం(Beijing Airport)లోని భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. దాంతో, ఈ వరల్డ్ కప్ హీరో కాసేపు అక్కడే నిరీక్షించాల్సి వచ్చింది. అయితే… కొద్ది సేపటికే మెస్సీకి వీసా(VISA) జారీ చేశారు. ఆ తర్వాత అతడిని బయటకు పంపించారు. అసలేం జరిగిందంటే..?
అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు ఆస్ట్రేలియాతో అంతర్జాతీయ బీజింగ్‌లోని వర్కర్స్ స్టేడియం(Beijing Workers Stadium)లోదోస్తీ మ్యాచ్ ఆడాల్సి ఉంది. దాంతో, మెస్సీ స్వదేశం నుంచి బీజింగ్‌కు బయలుదేరాడు. తీరా అక్కడ ల్యాండ్ అయ్యాక మెస్సీ అక్కడి అధికారులకు తన పాస్‌పోర్టు చూపించాడు. అర్జెంటీనా పాస్‌పోర్టు కాకుండా స్పెయిన్‌కు చెందిన పాస్‌పోర్టు(Spanish passport) అది . చైనాలో స్పెయిన్ దేశస్థులకు వీసా – ఫ్రీ ఎంట్రీ లేకపోవడంతో వాళ్లు మెస్సీని అడ్డుకున్నారు. ఈ విషయం క్షణాల్లో చైనా మీడియాకు చేరింది. అయితే.. మెస్సీ ఫ్రెండ్రీ మ్యాచ్ కోసం వచ్చాడని తెలిసిన అధికారులు ఆ తర్వాత వీసా జారీ చేశారు. దాంతో, ఈ స్టార్ ప్లేయర్ ఊపిరిపీల్చుకున్నాడు. హమ్మయ్య అనుకుంటూ విమానాశ్రయం నుంచి బయటపడ్డాడు.
ఫుట్‌బాల్ లెజెండ్స్‌లో ఒకడైన మెస్సీ గత వారమే పీఎస్జీ క్లబ్‌కు గుడ్ బై చెప్పాడు. రెండేళ్ల కాంట్రాక్ట్ ముగియడంతో అతను వచ్చే సీజన్లో అమెరికాకు చెందిన ఇంటర్ మియామి క్లబ్‌కు ఆడనున్నాడు. ఈ విషయాన్ని మెస్సీ ఈ మధ్యే వెల్లడించాడు. ఫుట్‌బాల్ దిగ్గజం డేవిడ్ బెక్‌హమ్(David Beckham) మియామి క్లబ్ సహ- యజమానిగా ఉన్నాడు.అయితే..సౌదీ అరేబియాకు చెందిన అల్ హిలాల్ క్లబ్ అతడికి రూ. 300 కోట్లు(45 మిలియన్ యూరోలు) ముట్టజెప్పాలనుకుంది. కానీ, మెస్సీ ఆసక్తి చూపలేదు.
మెస్సీ తప్పుకోవడంతో పీఎస్జీ ఆ క్లబ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 10 లక్షలకు తగ్గింది. మెస్సీ ఉన్నప్పుడు పీఎస్జీ క్లబ్‌ను 69.9 మిలియన్లు(6.9 కోట్లు) ఫాలో అయ్యేవాళ్లు. ప్రస్తుతం ఆ సంఖ్య 68.5 మిలియన్ల(6.8కోట్లు)కి చేరింది. ఖతర్‌లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్‌లో మెస్సీ అద్భుతంగా రాణించాడు. దాంతో, అర్జెంటీనా హోరాహోరీ ఫైనల్లో ఫ్రాన్స్‌ను షూటౌట్లో 4-2తో ఓడించింది. ఆ క్షణం వరల్డ్ కప్ గెలవాలన్న మెస్సీ కల నిజమైంది.