న్యూఢిల్లీ: దేశంలో ఎమర్జెన్సీని ప్రతిఘటించిన వ్యక్తుల త్యాగాలను స్మరించుకుని గౌరవించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. రాజ్యాంగబద్ధ హామీగా ఇచ్చిన హక్కులు అపహరణకు గురై, ఆపై ఊహించలేని భయానక పరిస్థితులకు గురైన బాధితులకు నివాళిగా క్యాబినెట్ బుధవారం రెండు నిమిషాలపాటు మౌనం పాటించింది. 2025 సంవత్సరం ‘సంవిధాన్ హత్య దివస్’కు 50 సంవత్సరాలని చెప్పారు.