
జడ్చర్ల, డిసెంబర్ 16 : మహనీయురాలు మదర్‌థెరిసా ఆశయాలను అందరూ పాటించాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని కుర్వగడ్డపల్లిలో ఏర్పా టు చేసిన మదర్‌థెరిసా విగ్రహాన్ని గురువారం ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తోటివారికి సాయం చేయడానికి తన జీవితాన్నే త్యజించిన మహనీయురాలు మదర్‌థెరిసా అని కొనియాడారు. మదర్థెరిసాను ప్రతిఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని సమాజ సేవలో భాగస్వాములు కావాలన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. కుర్వగడ్డపల్లిలో 90శాతం డ్రైనేజీలను నిర్మించినట్లు తెలిపారు. అలాగే మిషన్ భగీరథ పథకంతో ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి తాగునీటిని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు బాగుండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను అమలు చేయడంతోపాటు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదన్నారు. రైతును రాజు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని తెలిపారు. అనంతరం కుర్వగడ్డపల్లిలో యూత్ బిల్డింగ్ నిర్మాణానికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి భూమిపూజ చేశారు. రూ.3లక్షలతో భవ న నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంగీ త, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ప్రణీల్‌చందర్, మండల అధ్యక్షుడు సుందర్‌రెడ్డి, మాజీ వైస్‌ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, కౌన్సిలర్లు రఘురాంగౌడ్, ఉమాశంకర్‌గౌడ్, సర్పంచులు రాజేశ్వర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, నర్సింహులు, మదర్‌థెరిసా విగ్రహదాత జెడ్.శౌరీలమ్మ, గంగాపూర్ పాల గోపాల్, రమేశ్‌జీ, యాదయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఫాతిమారెడ్డి, రత్నరెడ్డి, జోసెఫ్‌రెడ్డి, ఫాదర్ శాంతిరెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యుడు ఇమ్మూ, మాజీ ఉపసర్పంచ్ శ్రీకాంత్‌రెడ్డి, శ్రీకాంత్, నాగిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఏఈ జవహర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
భక్తిభావం అలవర్చుకోవాలి
మిడ్జిల్, డిసెంబర్ 16 : ప్రతిఒక్కరూ భక్తిభావం అలవర్చుకొని సన్మార్గంలో పయనించాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని కంచనపల్లిలో గురువారం నిర్వహించిన ఆంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవానికి ఎమ్మె ల్యే హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయంలో సీతారామలక్ష్మణ, గణపతి, నాగ, నవగ్రహ, ధ్వజస్తంభ విగ్రహాల ప్రతిష్ఠాపనోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం మనదేవతల ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. అలాగే భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.