రంగవల్లితో రైతులకు పాఠం
- ప్రైవేట్ లెక్చరర్ వినూత్న ఆలోచన
- ఇతర పంటల సాగుపై ముగ్గుతో అవగాహన
పెద్దపల్లి, జనవరి 16 (నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని గాంధీనగర్‌కు చెందిన ప్రైవేట్ లెక్చరర్ నీతూప్రసాద్ సంక్రాంతి పండుగ సందర్భంగా తన ఇంటి ముందు వినూత్నంగా ముగ్గు వేసి రైతులను ఆలోచింపజేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతన్న వరి వైపు వెళ్లాలా..? లేదా ఇతర పంటలు సాగు చేయాలా? అనే విషయమై ముగ్గుతో దిశానిర్దేశం చేశారు. కేంద్రం విధానాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయానికి అనుగుణంగా రైతులు ఇతర పంటలు వేయాలని సూచించారు. ఏ పంట వేస్తే ఎన్ని రోజుల్లో దిగుబడి వస్తుందో రంగవల్లి ద్వారా వివరించారు.
వరి వేసి నష్టపోవద్దనే..

ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు వరి సాగు చేసి నష్టపోవద్దు. ఇతర పంటలపై దృష్టిసారించాలి. ఇదే విషయమై రైతులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ముగ్గువేశా. ఒకసారి వరి, మరోసారి ఇతర పంటలు వేయడం ద్వారా రైతులకు మేలు కలుగుతుంది.
- నీతూ ప్రసాద్, ప్రైవేట్ లెక్చరర్
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- farmers
- Rangavalli
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

