ఆర్మూర్ : ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్, మూడు మండలాల అభివృద్ధికి నిధులను మంజూరు చేయించాలని మంత్రి కేటీఆర్‌ను ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి సమక్షంలో ఆర్మూర్ టీఆర్ఎస్ నాయకులు కోరారు. ఆర్మూర్ పట్టణ అభివృద్ధికి ప్రత్యేకంగా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిధులు మంజూరు చేయించి పట్టణాన్ని మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేలా చూడాలన్నారు.
మంత్రి కేటీఆర్‌ను కలిసిన వారిలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి, మాక్లూర్ ఎంపీపీ మాస్త ప్రభాకర్, ఆర్మూర్ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గడ్డం మల్లారెడ్డి, ఆకుల రజనీష్, శ్రీనివాస్‌గౌడ్, రంజిత్ తదితరులున్నారు.