హనుమకొండ, ఆగస్టు 21 : భూమిలేని నిరుపేద ఉపాధి హామీ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేసారు. గురువారం హనుమకొండలోని సిపిఎం కార్యాలయంలో దళిత బహుజన ఫ్రంట్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భూమిలేని నిరుపేద ఉపాధి హామీ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి శంకరన్న, రాష్ట్ర అధ్యక్షుడు రౌతు రమేష్, వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మడి రాజుల రాములు, ఎఐకెఎస్ జిల్లా కార్యదర్శి చుక్కన్న, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి మంద సంపత్, ప్రజా సంఘాల జెఎసి జిల్లా చైర్మన్ మాదాసి సురేష్, డిబిఎఫ్ రాష్ర్ట మహిళా నాయకురాలు బొర్ర సంపూర్ణ, జిల్లా అధ్యక్షుడు కొమ్ముల కరుణాకర్, జిల్లా ఉపాధ్యక్షులు చుంచు రాజేందర్, బౌతు రాధ, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల అనిత, నాయకులు దుర్గం పుష్పలత, అనిత, మోరే, అయిలయ్య, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.