‘అదర్ పూనావాలాకు జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించాలి’
‘అదర్ పూనావాలాకు జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించాలి’ | సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సీఈఓ అదర్పూనావాలాకు జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించాలని కోరుతూ ముంబైకి చెందిన న్యాయవాది బాంబే హైకోర్టులో పిటిషన్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

ముంబై : సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సీఈఓ అదర్పూనావాలాకు జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించాలని కోరుతూ ముంబైకి చెందిన న్యాయవాది బాంబే హైకోర్టులో పిటిషన్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. టీకా సరఫరాకు సంబంధించి పూనావాలాను బెదిరించిన వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని న్యాయవాది దత్తా మానే కోర్టుకు విజ్ఞప్తి చేశారు. టీకా తయారీదారులు అభద్రతా భావానికి గురైతే వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుందని పిటిషన్లో పేర్కొన్నారు.
టీకా విషయంలో తనపై అనూహ్యమైన ఒత్తిడి ఉందని అదర్ పూనావాలా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దేశంలో శక్తిమంతమైన వ్యక్తుల నుంచి తనకు ఫోన్లు వస్తున్నాయని చెప్పారు. అందువల్లే తన కుటుంబంతో కలిసి లండన్‌కు వెళ్లినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే దత్తా మానె కోర్టును ఆశ్రయించారు. హోం మంత్రిత్వశాఖ ‘వై’ కేటగిరి భద్రతను కల్పించిందని, అయితే అది సరిపోదన్నారు. బెదిరింపులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, మహారాష్ట్ర డీజీపీ, పుణె కమిషనర్ విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.
ఇవి కూడా చదవండి..
మరో రెండు రోజులు వానలు
దేశంలో 16.24 కోట్ల టీకాల పంపిణీ : ఆరోగ్యశాఖ
టీకా మేధోసంపత్తి హక్కుల రద్దుకు అమెరికా ఆమోదం
12-15 ఏళ్లలోపు పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్.. అనుమతి తెలిపిన కెనడా
06-05-2021 గురువారం.. మీ రాశి ఫలాలు
తెలంగాణలో కొత్తగా 6,026 కరోనా కేసులు
అజిత్‌సింగ్ మృతిపై ప్రధాని సంతాపం
కేంద్రం తీరుపై కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఆగ్రహం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

