న్యూఢిల్లీ, అక్టోబర్ 27: సింఘు సరిహద్దుల్లో దళిత రైతు లఖ్బీర్ సింగ్ దారుణహత్యను నిరసిస్తూ యూపీ, ఉత్తరాఖండ్‌కు చెందిన వందలాది మంది రైతులు బుధవారం ఢిల్లీకి ర్యాలీగా వెళ్లారు. అయితే వారిని ఢిల్లీ పోలీసులు సరిహద్దుల్లోనే నిలిపివేశారు. దీంతో నిరసనకారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈక్రమంలో రైతులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. నిరసనకారుల్లో లఖ్బీర్ సింగ్ కుటుంబసభ్యులు కూడా ఉన్నట్టు సమాచారం.