Akhil Akkineni | బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినా ఇప్పటివరకు సరైన బ్రేక్ లేని యంగ్ యాక్టర్లలో ఒకడు అక్కినేని అఖిల్. ఈ సారి ఎలాగైనా హిట్టు కొట్టాలని లెనిన్ సినిమాతో రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే అఖిల్ ఇటీవలే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో సమావేశం కావడం ఇండస్ట్రీ సర్కిల్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ ఇద్దరు ఒక్క చోట చేరడంతో రాబోయే రోజుల్లో క్రేజీ రాంబోలో సినిమా వస్తుందా.. అంటూ ఎక్జయిటింగ్‌గా చర్చించుకుంటున్నారు సినీ జనాలు.
కాగా ఇప్పుడు మరో అప్డేట్ తెరపైకి వచ్చింది. కొత్త ప్రాజెక్టు రాబోతుంది నిజమే కానీ.. ఈ ఇద్దరి కాంబోలో కాదట. ప్రశాంత్ నీల్ దగ్గర పనిచేసే వ్యక్తుల్లో ఒకరు అఖిల్‌తో సినిమా చేయబోతున్నాడట. ప్రశాంత్ నీల్, అఖిల్ మీటింగ్ ప్రాథమిక చర్చల కోసం మాత్రమేనని, ఈ సమావేశంలో సినిమాను ఎవరు డైరెక్ట్ చేసేది ఎవరనేదానిపై క్లారిటీకి వచ్చారని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ టీం ఫైనల్ డెసిషన్ రాగానే.. అధికారిక ప్రకటన ఉండబోతుందని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం.
మొత్తానికి అఖిల్ ఈ సారి రూటు మార్చి ఏకంగా కన్నడ డైరెక్టర్‌తో సినిమాకు ప్లాన్ చేస్తున్నాడంటూ చర్చించుకోవడం మొదలుపెట్టారు మూవీ లవర్స్. మరి రాబోయే రోజుల్లో అఖిల్ నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి.
Shankar | ‘వేల్పారి’తో మరో విజువల్ వండర్ … 1000 కోట్ల ప్రాజెక్ట్‌పై కోలీవుడ్‌లో భారీ చర్చ
Bigg Boss 9 Telugu | 13వ వారం టికెట్ టూ ఫినాలే హీట్.. రీతూ, సంజనాల డ్రామాలు చూసి షాక్
Aryan Khan | మరోసారి చిక్కుల్లో ఆర్యన్ ఖాన్.. కేసు నమోదు