న్యూయార్క్ : ఈ ఏడాది సెప్టెంబర్ రెండో వారంలో ఐఫోన్ 14 సిరీస్ లాంఛ్ అవుతుందని టెక్ నిపుణులు అంచనా వేస్తుండగా హాట్ ఫోన్ ఫీచర్స్పై స్పెక్యులేషన్స్ జోరందుకుకన్నాయి. గతంలో ఐఫోన్ 14 నాలుగు మోడల్స్ ఏ16 బయోనిక్ చిప్సెట్తో వస్తాయని వార్తలు రాగా తాజాగా ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్‌లు ఐఫోన్ 13 సిరీస్‌లో వాడిన ఏ15 బయోనిక్ చిప్‌తో కస్టమర్ల ముందుకు వస్తాయని లేటెస్ట్ రిపోర్ట్ వెల్లడించింది.
ఖరీదైన మోడళ్లు ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ ఫోన్లు యాపిల్ నెక్ట్స్ జనరేషన్ చిప్ ఏ16 బయోనిక్ ప్రాసెసర్‌పై రన్ అవుతాయి. ఐఫోన్ 13తో పోలిస్తే ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్, ఐఫోన్ 14 మ్యాక్స్‌లు లేటెస్ట్ చిప్‌తో రానుండటంతో ఇవి అధిక ర్యాం, జీపీయూ పవర్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటాయి. దిగువ శ్రేణి మోడల్స్‌లో న్యూ చిప్సెట్ అమర్చేందుకు యాపిల్‌కు ఎదురవుతున్న ఇబ్బందులతో పాటు అంతర్జాతీయంగా చిప్‌ల కొరత కూడా టెక్ దిగ్గజం తాజా నిర్ణయానికి కారణమై ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు యాపిల్ మినీ మోడల్‌ను పక్కనపెట్టి ఐఫోన్ 14 మ్యాక్స్‌తో దాన్ని భర్తీ చేయనుందని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇక ఐఫోన్ 14 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ వంటి నాలుగు మోడల్స్ మార్కెట్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఇక ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్ వైడ్ నాచ్, డ్యూయర్ రియర్ కెమెరా సిస్టమ్‌తో రానుండగా ప్రొ మోడల్స్ ముందు భాగంలో పిల్ షేప్ డిజైన్, రియర్ ప్యానెల్‌పై ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ఆకట్టుకుంటాయని చెబుతున్నారు.