ముంబై, జనవరి 30: ప్రముఖ గాయకురాలు లతా మంగేష్కర్ కొవిడ్ నుంచి కోలుకున్నారు. నెలక్రితం కరోనా, న్యూమోనియాతో ఆమె ముంబైలోని ఓ దవాఖానలో చేరారు. మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి మెరుగైందని, ప్రస్తుతం వెంటిలేటర్ అవసరం లేదని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తెలిపారు.