ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయెబ్ అక్తర్(Shoaib Akhtar) సోదరుడు షాహిద్ అక్తర్ రెండో రోజుల క్రితం మరణించిన విషయం తెలిసిందే. అయితే ఇస్లామాబాద్‌లో షాహిద్ అక్తర్ పార్దీవదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆ కార్యక్రమంలో పాక్ ఉగ్ర సంస్థ లష్కరే తోయిబాతో లింకున్న రాజకీయ పార్టీ నేతలు పాల్గొనడం చర్చనీయాంశమైంది. ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఆశ్రయం కల్పిస్తుందన్న వాదనలను బలపరిచే రీతిలో ఆ ఘటనకు చెందిన వీడియో కూడా రిలీజైంది.
సెప్టెంబర్ 26 ముంబై దాడుల సూత్రధారి, లష్కరే వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌తో లింకున్న పాకిస్థాన్ మర్కాజీ ముస్లిం లీగ్ పార్టీ నేతలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. పీఎంఎంఎల్ చీఫ్ ఇనామ్ ఉర్ రెహ్మాన్ ఖాంబో ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయనతో పాటు పీఎంఎంఎల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ అబ్దుల్లా తోర్, జోనల్ జనరల్ సెక్రటరీ హఫీజ్ ఉమర్, అంజద్ భాటీ కూడా నివాళి అర్పించారు.
వరుస క్రమంలో నిలబడ్డ ఆ నేతలు.. షోయెబ్ అక్తర్ సోదరుడి మృతికి నివాళి అర్పించారు. షోయెబ్ ఇంటికి లష్కరే అనుబంధ నేతలు రావడం ఆందోళన కలిగిస్తున్నది. పాకిస్థానీ పబ్లిక్ ఫిగర్ అయిన షోయెబ్ అక్తర్ ఇంటికి ఉగ్రవాదులు రావడం.. ఆ దేశం వారికి అండగా నిలుస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతోంది.