పాట్నా, అక్టోబర్ 24: ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ మూడేండ్ల తర్వాత పాట్నాకు వచ్చారు. లాలూ కుమారులు తేజ్ ప్రతాప్, తేజస్వీ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు. అయితే, లాలూ ఉంటున్న నివాసంలోకి వెళ్లనీయకుండా కొందరు అడ్డుకోవడంపై తేజ్ ప్రతాప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రిని కలవకుండా విరోధులు అడ్డుకొంటున్నారని రాష్ట్ర ఆర్జేడీ చీఫ్ జగదానంద్ను ఉద్దేశిస్తూ ఆరోపించారు. తల్లి రబ్రీదేవి ఇంటి ముందు ధర్నా నిర్వహించారు.