కైరో: వలసదారులకు సంబంధించిన నిబంధనల్లో కువైట్ కీలక మార్పులు చేసింది. యూనివర్సిటీ డిగ్రీలు లేని 60 ఏండ్లు పైబడిన వలసదారులు కూడా ఇకపై తమ దేశంలో ఉపాధిపనులు చేసుకునేందుకు అంగీకరించింది. ఈ మేరకు ఉపాధి పనుల్లో వారి నియామకాన్ని అడ్డుకునే నిబంధనలను రద్దు చేస్తునట్టు మినిస్టర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ అబ్దుల్లా ఆల్ సల్మాన్ తెలిపారు. అయితే వర్క్పర్మిట్ను పునరుద్ధరించుకునేందుకు ఏడాదికి రూ. 1.35 లక్షలను ఫీజుగా చెల్లించాలన్నారు. ఆరోగ్య బీమాను తప్పనిసరి చేశారు. తాజా నిబంధనలు ఎప్పటినుంచి అమల్లోకి వస్తాయన్న విషయం తెలియరాలేదు. కాగా నిబంధనల్లో తాజా సడలింపులతో భారత్ నుంచి వలస వెళ్లే వారికి ప్రయోజనం చేకూరనున్నది.