మూడేళ్ల కాంగ్రెస్ పాలనపై మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ఫైర్
ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, మూడేళ్లు గడుస్తున్నా హామీల అమలులో విఫలమైందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. అభయహస్తం పేరుతో...
చౌటుప్పల్, నవంబర్ 17 : ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, మూడేళ్లు గడుస్తున్నా హామీల అమలులో విఫలమైందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. అభయహస్తం పేరుతో ప్రజలకు ఆశలు కల్పించిన కాంగ్రెస్ పాలన నేడు శూన్యహస్తంగా మారిందని ఎద్దేవా చేశారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, ఎకరాకు రూ.15 వేల పెట్టుబడి సాయం, కౌలు రైతులకు ఆర్థిక సహాయం, వరికి రూ.500 బోనస్ వంటి హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదన్నారు.
ధాన్యం కొనుగోళ్లలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, కొనుగోలు కేంద్రాల్లో రైతులు రోజుల తరబడి ఎదురుచూస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని ఆరోపించారు. నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు, రూ.4 వేల నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు రూ.2,500, వృద్ధులకు రూ.4 వేల పింఛన్, విద్యార్థులకు విద్యా భరోసా వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల సంక్షేమ నిధి వంటి హామీలను కూడా నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మూడేళ్ల కాంగ్రెస్ పాలనపై మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ఫైర్
Rajinikanth | ఫ్యామిలీతో వెకేషన్ మూడ్లో రజినీకాంత్.. ఇంతకీ ఎక్కడికెళ్లారో తెలుసా..?
Dava Vasantha Suresh | కోరుట్ల ఎమ్మెల్యే నివాసంపై కాంగ్రెస్ దాడి అప్రజాస్వామికం : దావ వసంత సురేష్
రుణాల పేరుతో మహిళలకు రూ.20 లక్షల టోకరా!
లబ్ధిదారులకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

