జగద్గిరిగుట్ట : బాలికను ప్రేమ పేరుతో వేధించిన వ్యక్తికి మూడేళ్ల జైలుశిక్ష పడింది. జగద్గిరిగుట్ట సీఐ నరసింహ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎల్లమ్మబండ మహంకాళి నగర్‌కు చెందిన కుమార్ (30) కార్మికుడు. అదే ప్రాంతానికి చెందిన బాలికను మూడేళ్ల క్రితం ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేశాడు. దాంతో బాధితురాలు కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కూకట్పల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ చేపట్టి నిందితుడు కుమార్‌కు శిక్ష ఖరారు చేసింది. మూడేళ్ల జైలుశిక్షతోపాటు రూ.10 వేలు జరిమానా విధించింది. కేసులో కీలకంగా వ్యవహరించిన కాశీనాథ్‌ను ఉన్నతాధికారులు అభినందించారు.