సిరిసిల్ల టౌన్ : బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు ( KTR ) గురువారం సిరిసిల్లలో ( Siricilla ) పర్యటించారు. తంగ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లెలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బీరప్ప- కామరతి కల్యాణ మహోత్సవ వేడుకలకు హాజరయ్యారు. కుర్మ సంఘం ఆధ్వర్యంలో నాయకులు కేటీఆర్కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలో ఆయన పాల్గొన్నారు.
మున్సిపల్ పరిధిలోని పెద్దూరులో బీఆర్ఎస్ నాయకుడు ముష్కం దేవగౌడ్ కూతురు వివాహం ఇటీవల జరగగా వారి నివాసానికి వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించారు.కేటీఆర్ వెంట నాఫ్ స్కాట్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, బీఆర్ఎస్ తంగళ్లపల్లి మండల అధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, బొల్లి రామ్మోహన్, సింగిరెడ్డి రవీందర్ రెడ్డి పడిగెల రాజు, మాట్ల మధు, కేటీఆర్ సేన మండలాధ్యక్షుడు భాస్కర్ గౌడ్, కల్లూరి రాజు, అన్నారం శ్రీనివాస్, బండారి శ్యాం, కుంబాల మల్లారెడ్డి, సత్తార్, తదితర నాయకులు పాల్గొన్నారు.