మేడ్చల్‌లో కేటీఆర్‌కు ఘన స్వాగతం
ఆదిలాబాద్ రైతు గర్జనకు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మేడ్చల్‌లో ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. వివేకానంద విగ్రహం వద్ద కేటీఆర్‌కు మంగళహారతులతో స్వాగతిస్తూ.
ఆదిలాబాద్ రైతు గర్జనకు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మేడ్చల్‌లో ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. వివేకానంద విగ్రహం వద్ద కేటీఆర్‌కు మంగళహారతులతో స్వాగతిస్తూ.. బీఆర్ఎస్ నేత, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్ ఆయనకు గుమ్మడికాయతో దిష్టితీశారు. అనంతరం ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, మాజీ ప్రతినిధులు భారీగా తరలివచ్చారు. కేటీఆర్ రాగానే బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉత్సాహంతో ఆయన వద్దకు వచ్చి కరచాలనం చేసేందుకు, సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్ రెడ్డి, ఎల్లంపేట మున్సిపాలిటీ చైర్మన్ శ్రీదేవి పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

