భవిష్యత్ బీఆర్ఎస్దే
తెలంగాణలో భవిష్యత్తు బీఆర్ఎస్దేనని రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి కార్తిక్‌రెడ్డి అన్నారు. ఆదివారంశంషాబాద్ డివిజన్ పరిధిలోని పాత శంషాబాద్‌తోపాటు గొల్లపల్లి ప్రాంతాలకు చెందిన దాదాపు 50 మంది యువకులు డివిజన్ అధ్యక్షుడుకొలన్ ప్రదీప్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.
- రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి కార్తిక్‌రెడ్డి
శంషాబాద్ రూరల్, నవంబర్ 1 :తెలంగాణలో భవిష్యత్తు బీఆర్ఎస్దేనని రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి కార్తిక్‌రెడ్డి అన్నారు. ఆదివారంశంషాబాద్ డివిజన్ పరిధిలోని పాత శంషాబాద్‌తోపాటు గొల్లపల్లి ప్రాంతాలకు చెందిన దాదాపు 50 మంది యువకులు డివిజన్ అధ్యక్షుడుకొలన్ ప్రదీప్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలిచ్చి అధికారంలోకివచ్చినా మూడు సంవత్సరాలలోపే తెలంగాణను ఏడారిగా మార్చిందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలు ఎవరూ ఆనందంగా లేరన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపడం కోసం తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుచ్చిరెడ్డి, రాహుల్, జయకృష్ణగౌడ్, ఫాతిమా, మహేశ్‌యాదవ్, పరమేశ్, వెంకటేశ్, టిల్లు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్లో చేరిన యువకులకు కార్తిక్‌రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన చేరిన వారిలో కుమ్మరి విజయ్‌కుమార్, సంతన్‌రెడ్డి, వేణుచారి, ఆదిత్య, అజయ్‌కుమార్, రామకృష్ణ, రోహిత్చారి, ఆనంద్‌చారి, ఉదయ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

