రైతాంగాన్ని ముంచిన ప్రభుత్వం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో రైతాంగాన్ని నిలువునా ముంచిందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు.
- విత్తనాలు, సాగు నీరు, రైతు భరోసా అన్నింటా మోసం
- రైతు గర్జన సభకు తరలిన బీఆర్ఎస్ నాయకులు
రైతు గర్జన సభకు తరలిన బీఆర్ఎస్ నాయకులు మంచిర్యాల టౌన్, నవంబర్ 1 : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో రైతాంగాన్ని నిలువునా ముంచిందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. రైతు సమస్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్‌లో నిర్వహిస్తున్న రైతు గర్జన సభకు మంచిర్యాల నుంచి బీఆర్ఎస్ నాయకులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మద్దతు ధర, పంటల కొనుగోళ్లు, విత్తనాలు, సాగునీరు, రైతుభరోసా, ఇ లా అన్ని విషయాల్లో మోసగించిందని మండిపడ్డారు.
పంటలు ఎండుతున్నాయని, కాం గ్రెస్ నాయకులు మాత్రం దేశ రాజధాని చు ట్టూ చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు. ఆదిలాబాద్‌లో నిర్వహించే రైతుగర్జన సభ నుంచే వారి పాలనకు చరమగీతం పాడుతారని, కాంగ్రెస్‌ను బొంద పెట్టేందుకు రాష్ట్ర ప్ర జలంతా ఒక్కటై ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. తరలిన వారిలో బీఆర్ఎస్ నాయకులు గాదె సత్యం, గోగుల రవీందర్‌రెడ్డి, అంకం నరేశ్, చంద్రశేఖర్హండే, హైమద్, ఒడ్నాల రవీందర్ తదితరులు ఉన్నారు.
చెన్నూర్ నుంచి..
చెన్నూర్, నవంబర్ 1 : చెన్నూర్ పట్టణం నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు తరలివెళ్లారు. ఈ రైతు గర్జన సభలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొంటుండగా, వెళ్లారు. వారిలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ లీగల్ అడ్వైజర్ మల్లేశం గౌడ్, మాజీ జడ్పీటీసీ మోతె తిరుపతి, మున్సిపల్ కౌన్సిలర్ కొప్పుల ప్రభాకర్ తదితరులు ఉన్నారు.
కోటపల్లి నుంచి..
కోటపెల్లి, నవంబర్ 1 : రైతు గర్జన బహిరంగ సభకు బీఆర్ఎస్ పార్టీ మంచిరాయల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆదేశాల మేరకు కోటపల్లి మండలం నుంచి బీఆర్ఎస్ శేణులు తరలివెళ్లాయి. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా మండల ఇన్చార్జి బాపునాయక్, మండలంలోని సర్పంచులు, చైర్మన్లు, నాయకులు తదితరులు ఉన్నారు.
జైపూర్ నుంచి..
జైపూర్, నవంబర్ 1 : జైపూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఆదిలాబాద్ తరలివెళ్లారు. బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు బల్మూరి అరవిందరావు, సీనియర్ నాయకులు రిక్కుల మధూకర్‌రెడ్డి, ఆర్నె సమ్మయ్య, మేడి తిరుపతి, మేడి రవి, అరికె సంతోష్, బడుగు రవి, లింగారెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ గుండు తిరుపతి, అమీర్అలీ, గయాజ్తో పాటు పలువురు నాయకులు ఉన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

