ప్రభుత్వ అసమర్థతతోనే ఆత్మహత్యలు
కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనంతో రాష్ట్రంలో 1,000 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారని, ఇవీ సర్కార్ చేసిన హత్యలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
- బాధిత కుటుంబాలను ఆదుకొనేలా ఒత్తిడి తెస్తం
- ఏడాదిపాటు ధైర్యంగా ఉండండి త్వరలో కేసీఆర్ వస్తరు
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- తలమడుగులో ఒక్కో బాధిత కుటుంబానికి 2 లక్షల సాయం
ఆదిలాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనంతో రాష్ట్రంలో 1,000 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారని, ఇవీ సర్కార్ చేసిన హత్యలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు గ్రామంలో ఇటీవల ఆత్మహత్యలు చేసుకొన్న నలుగురు రైతు కుటుంబాలను ఆదివారం కేటీఆర్ పరామర్శించారు. బీఆర్ఎస్ తరఫున నాలుగు కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించారు. కాంగ్రెస్ వచ్చాక అధోగతి పాలై, అప్పులు పెరిగి దిక్కుతోచని స్థితిలో తలమడుగులో రైతులు కాడే లస్మన్న, గుర్రాల ప్రతాప్‌రెడ్డి, పసులు ఆశన్న, బద్ధం రాజేశ్వర్‌రెడ్డి చనిపోయాడని తెలిపారు. లస్మన్న అనే రైతు వ్యవసాయ పొలంలో ఉరేసుకొని తనువు చాలించాడని, గుర్రాల ప్రతాప్‌రెడ్డి ఇంటి వాకిట్లో ఉన్న సోయా కుప్పమీద పురుగుల మందు తాగి చనిపోయాడని, పసుల ఆశన్న పురుగుల మందు తాగాడని, రాజేశ్వర్‌రెడ్డి చేనులో పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు.
రైతులారా ధైర్యంగా ఉండండి
‘ఏడాదిపాటు ధైర్యంగా ఉండండి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా రాబోతున్నారు. ఆయనొస్తే రైతులు, గరీబోళ్లకు మేలు జరుగుతుంది. ఏ ఒక్కరూ మనోనిబ్బరం కోల్పోవద్దు. మీకు అండగా మేము ఉంటాం’ అని కేటీఆర్ భరోసా ఇచ్చారు. నాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఆత్మహత్యలే తగ్గాయని, ఈ మూడేండ్ల కాంగ్రెస్ పాలనలో రైతులు అనేక కష్టాలు పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. తలమడుగులో ఆత్మహత్య చేసుకొన్న రైతు కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రైతుబీమా ఇవ్వడమే లేదని విమర్శించారు. ఆ బాధిత కుటుంబాలకు అండగా ఉందామని, వారికి ధైర్యం చెప్పాలని కేసీఆర్ తనకు, ఎమ్మెల్యే అనిల్‌జాదవ్‌కు సూచించారని చెప్పారు. మరో రైతు చనిపోకుండా ధైర్యం ఇవ్వాలని చెప్పినట్టు తెలిపారు. చనిపోయిన 1,000 కుటుంబాలను ఆదుకొనేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని స్పష్టంచేశారు. గట్టిగా కొట్లాడి తలమడుగును కరువు మండలంగా ప్రకటించేలా చేద్దామని అనిల్‌జాదవ్‌కు పిలుపునిచ్చారు.
కేటీఆర్ సార్ సాయం చేసిన్రు
పంటలు నష్టపోయి అప్పుల బాధతో మా నాన్న పసుల ఆశన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం ఇప్పటివరకు పట్టించుకోలేదు. మా నాన్న పంటల సాగు కోసం రూ. 8 లక్షలు అప్పు చేశాడు. వాటిని ఎలా తీర్చాలో తెలియక మనోవేదనకు గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

అప్పులపాలై ఉపాధి కరువైన మమ్మల్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. బీఆర్ఎస్ పార్టీ తరపున కేటీఆర్ సార్ రూ.2 లక్షల సాయం అదించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో రైతుబీమా పథకం ద్వారా మరణించిన రైతు కుటుంబాలకు రూ. 5 లక్షలు ఇచ్చేవారు. ఇప్పుడు మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం అందక రోడ్డున పడే పరిస్థితి నెలకొన్నది.
– రమాకాంత్, (ఆత్మహత్య చేసుకున్న రైతు ఆశన్న కుమారుడు), పిప్పల్‌కోటి, భీంపూర్ మండలం
కేటీఆర్ రైతులకు భరోసా ఇచ్చారు
ఆత్మహత్యలకు పాల్పడొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతులకు ధైర్యం చెప్పారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని రైతుల ఇబ్బందులు తొలగిపోతాయి. రైతులు కష్టకాలంలో ఉన్న సమయంలో కేటీఆర్ వచ్చి ధైర్యం చెప్పడం గొప్ప విషయం.

రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎలాంటి సాయం అందించడం లేదు. బీఆర్ఎస్ పార్టీ అందించిన సాయంతో మాకెంతో ప్రయోజనం చేకూరుతుంది.
– నితిన్‌రెడ్డి (ఆత్మహత్య చేసుకున్న రైతు రాజేశ్వర్‌రెడ్డి కుమారుడు), బోథ్ మండలం ధనోరా
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

