హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కార్మిక సంక్షేమానికి ప్రభు త్వం పాటుపడాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం మాజీ మంత్రి వీశ్రీనివాస్గౌడ్తో కలిసి వివిధ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులతో కేటీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లు, భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. కార్మికులను రోడ్డున పడేసే ఏ చర్యలనైనా బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయడంతోపాటు కార్మికులకు మౌలిక వసతులు కల్పించి ప్రోత్సాహకాలు అందించిందని గుర్తుచేశారు.
గత ప్రభుత్వ హయాంలో కార్మికశాఖ ద్వారా అనేక సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గుర్తుచేశారు. సమావేశంలో ఎంటీఏఆర్ కంపెనీ జనరల్ సెక్రటరీ మాయ రాజ య్య, డిప్యూటీ జనరల్ సెక్రటరీలు సత్యప్రసా ద్, వెంకట్రామయ్య, రాముడు, యాదవ్, సమ్మయ్య, బుచ్చిరెడ్డి, మయోర కంపెనీ జనరల్ సెక్రటరీ సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.