KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో (Delhi) విద్యార్థులు చేస్తున్న నిరసనలకు సంఘీభావంగా రేపు పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిశ్చయించకున్నారు. విద్యార్థుల ఆందోళనలకు మద్దతుగా, పోలీసుల అణచివేతకు వ్యతిరేకంగా రేపు ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్ విద్యార్థి విభాగం(BRSV) నిర్వహించే నిరసనలో కేటీఆర్ పాల్గొననున్నారు.
కాగా, నీట్ పేపర్ లీకేజీని(NEET paper) నిరసిస్తూ, విద్యా వ్యవస్థలో సంస్కరణలు తేవాలని, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల్లో విదార్థి సంఘాలు, విపక్షాలు ఆందోళనలు నిర్వహించాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో సీజేపీ కూడా తన దీక్షను కొనసాగిం చింది. ఈ నేపథ్యంలో పోలీసులు, విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేసి టియర్ గ్యాస్ ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటీర్ తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.