శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
‘వంశిక శభాష్.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికకావడం గర్వకారణం’అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. విద్యార్థిని క్రీడాప్రయాణానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : ‘వంశిక శభాష్.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికకావడం గర్వకారణం’అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. విద్యార్థిని క్రీడాప్రయాణానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ జడ్పీహెచ్ఎస్కు చెందిన పదో తరగతి విద్యార్థిని గూడెపు వంశిక శుక్రవారం తెలంగాణ భవన్లో కేటీఆర్‌ను కలిసింది. ఆమె క్రికెట్లో సాధించిన విజయాలు, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన తీరు, భవిష్యత్తు లక్ష్యాల గురించి కేటీఆర్ వివరాలు తెలుసుకున్నారు. వంశిక సాధించిన విజయానికి కృషి చేసిన వ్యాయామ ఉపాధ్యాయుడు కుంట శ్రీనివాస్‌ను, ఆమెకు ప్రోత్సాహం అందించిన పాఠశాల ఉపాధ్యాయులను అభినందించారు.
రాష్ట్రస్థాయిలో సత్తా చాటిన వంశిక
అక్టోబర్ 10 నుంచి 13 వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో వంశిక అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. నవంబర్ మొదటి వారంలో జమ్ముకశ్మీర్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో వంశిక తెలంగాణ తరఫున ఆడనున్నది. జాతీయ స్థాయికి ఎంపికకావడం పాఠశాలతో పాటు నామాపూర్ గ్రామానికి గర్వకారణంగా నిలిచింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
100 రోజులు ఏపీలోఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో ఎత్తింది 65 టీఎంసీలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

