చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
బుద్ధారం రిజర్వాయర్ లెఫ్ట్ కెనాల్ నుంచి సాగునీరు చివరి ఆయకట్టుకూ పారించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అల్వాల గ్రామ శివారులో ఎండిన వరి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ..
- అల్వాలలో ఎండిన పంటల పరిశీలన
పెద్దమందడి, అక్టోబర్ 23 : బుద్ధారం రిజర్వాయర్ లెఫ్ట్ కెనాల్ నుంచి సాగునీరు చివరి ఆయకట్టుకూ పారించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అల్వాల గ్రామ శివారులో ఎండిన వరి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇది కాలం తెచ్చిన కరువు కాదని.. కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన కరువు అని మండిపడ్డారు. కృష్ణానదికి వరద వచ్చిన సమయంలో నీటిని ఒడిసిపట్టకపోవడం.. నేడు కరువుకు మూలమైందని మండిపడ్డారు.
సాగునీరు అందక.. విద్యుత్ కోతలతో 200 ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని, ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించి బుద్ధారం రిజర్వాయర్ నుంచి నీటిని ఇచ్చి రైతులను ఆదుకోవాలని, నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఎండిన పంటలను అంచనా వేసి రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పంటలు ఎండిపోయాయని పలువురు రైతులు, నిరంజన్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

