CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
CAG Report | రాష్ర్టానికి వస్తున్న ఆదాయానికి, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వ్యయానికి మధ్య అంతరం (ద్రవ్యలోటు) భారీగా పెరుగుతున్నది. సొంత ఆదాయ వృద్ధి కంటే రుణ సమీకరణకే రేవంత్రెడ్డి సర్కార్ అధిక ప్రాధాన్యమిస్తుండటంతో తెలంగాణపై అప్పుల భారంగా విపరీతంగా పెరిగిపోతున్నది.
CAG Report | హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : రాష్ర్టానికి వస్తున్న ఆదాయానికి, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వ్యయానికి మధ్య అంతరం (ద్రవ్యలోటు) భారీగా పెరుగుతున్నది. సొంత ఆదాయ వృద్ధి కంటే రుణ సమీకరణకే రేవంత్రెడ్డి సర్కార్ అధిక ప్రాధాన్యమిస్తుండటంతో తెలంగాణపై అప్పుల భారంగా విపరీతంగా పెరిగిపోతున్నది.
ప్రస్తుతం రాష్ట్ర రెవెన్యూ రాబడి 33 శాతంగా ఉంటే.. అప్పులు మాత్రం సుమారు 73 శాతానికి పెరిగాయి. అప్పులతోపాటు రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు తలకుమించిన భారంగా మారాయి. గత నెలలో తెలంగాణ ఆర్థిక స్థితిగతులకు సంబంధించి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) శుక్రవారం విడుదల చేసిన నివేదిక ఈ విషయాలను బట్టబయలు చేసింది. ఈ నివేదిక ప్రకారం.. ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్) చివరి నాటికి రాష్ట్ర రెవెన్యూ రాబడి రూ.92,013 కోట్లు (బడ్జెట్ అంచనాలో 33.49%)గా, రెవెన్యూ వ్యయం రూ.1,07,109 కోట్లు (45.69%)గా నమోదైంది. ఇందులో సొంత అప్పులు రూ.61,457.16 కోట్లు (72.59%)గా ఉన్నాయి. రాష్ట్ర రెవెన్యూ లోటు రూ.220.13 కోట్లకు, ద్రవ్యలోటు రూ.58,458.71 కోట్లకు చేరింది. కేసీఆర్ పాలన నాటితో పోలిస్తే ఇప్పుడు రెవెన్యూ రాబడుల శాతం కూడా తగ్గింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తొలి 6 నెలలు ముగిసేనాటికి బడ్జెట్ అంచనాలో 40.27 శాతంగా ఉన్న రెవెన్యూ రాబడులు ఈ ఆర్థిక సంవత్సరంలో 38.14 శాతానికే పరిమితమయ్యాయి. అంటే రెవెన్యూ రాబడుల్లో 2.13 శాతం క్షీణత నమోదైంది.
రూ.15,096.18 కోట్ల రెవెన్యూ లోటు
ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.6,857.76 కోట్ల రెవెన్యూ మిగులు సాధిస్తామని కాంగ్రెస్ సర్కార్ గొప్పలు చెప్పింది. కానీ, ఆ అంచనా కేవలం 180 రోజుల్లోనే పూర్తిగా తలకిందులైంది. గత నెలాఖరు నాటికి రాష్ట్రం ఏకంగా రూ.15,096.18 కోట్ల భారీ రెవెన్యూ లోటులో కూరుకుపోయింది. కొత్త అప్పులు తీసుకోకపోతే ప్రభుత్వం కనీస పరిపాలన కూడా సాగించలేని దయనీయ స్థితికి చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న రూ.58,458.71 కోట్ల రుణ సమీకరణ లక్ష్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత నెలాఖరు నాటికే రూ.44,612.16 కోట్ల రుణాలను సమీకరించింది. అంటే కేవలం తొలి 6 నెలల్లోనే ఏకంగా 76.31% అప్పులను ఊడ్చేసింది. దీంతో మిగిలిన 6 నెలల్లో (వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు) కేవలం రూ.13,846.55 కోట్ల అప్పులను మాత్రమే సమీకరించాల్సి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. నవంబర్ చివరినాటికే ఈ కోటాను కూడా పూర్తిచేసే అవకాశం కనిపిస్తున్నది. తద్వారా ఎఫ్ఆర్బీఎం పరిమితిని దాటిపోయి రాష్ట్రంలో ఆర్థిక స్తంభన తెచ్చే ప్రమాదం ఉన్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వార్షిక రుణ పరిమితిని రూ.58,458 కోట్ల నుంచి రూ.61,457 కోట్లకు సవరించారు. తెలంగాణలో కొన్ని నిర్దిష్ట మౌలిక సంస్కరణల అమలుకు రేవంత్రెడ్డి సర్కార్ అంగీకరించడంతో కేంద్రం ఈ సవరణకు సమ్మతించింది. కానీ, రాష్ట్రంలో ఏ సంసరణల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించిందో అధికారవర్గాలు వెల్లడించలేదు.
ప్రధాన ఆదాయ రంగాలన్నీ విఫలం
రేవంత్రెడ్డి అసమర్థ పాలన వల్ల రాష్ట్ర ప్రధాన ఆదాయ వనరులన్నీ కుప్పకూలాయి. ముఖ్యంగా పన్నేతర ఆదాయం పాతాళానికి పడిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన రూ.35,730.20 కోట్లలో సెప్టెంబర్ వరకు సాధించింది రూ.5,754.24 కోట్లు (16.10%) మాత్రమే వచ్చాయి. గత నెలలో ఈ రాబడి కేవలం రూ. 278.60 కోట్లకే పరిమితమైంది. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నిసార్లయినా ఢిల్లీకి వెళ్తానన్న సీఎం రేవంత్రెడ్డి.. ఇప్పటివరకు కేంద్రం నుంచి రూ.3,705.98 కోట్లు మాత్రమే తేగలిగారు. కేంద్రం నుంచి తెస్తామన్న రూ.24,166 కోట్ల గ్రాంట్లలో ఇది కేవలం 15.34% మాత్రమే. ఈ ఆర్థిక సంవత్సరంలో భూముల రాబడి కింద రూ.11.15 కోట్లు వస్తాయని భావించిన కాంగ్రెస్ సర్కార్కు గత 6 నెలల్లో రూ.21 లక్షలు మాత్రమే వచ్చినట్టు ‘కాగ్’ నివేదిక వెల్లడించింది.
ఉద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరం
ఈ ఆర్థిక సంవత్సరంలో పెన్షన్ల చెల్లింపుల కోసం రాష్ట్ర బడ్జెట్లో రూ.14,736.56 కోట్లు కేటాయించిన రేవంత్రెడ్డి సర్కార్.. సెప్టెంబర్ నాటికే రూ.14,235.36 కోట్లు (96.60%) వాడేసింది. ఈ పద్దులో వచ్చే 6 నెలలకు మిగిలింది రూ.501.20 కోట్లు (3.40%) మాత్రమే. ఉద్యోగుల జీతభత్యాల కోసం బడ్జెట్లో కేటాయించిన రూ.48,358.21 కోట్లలో ప్రభుత్వం ఇప్పటికే రూ.25,258.11 కోట్లు (52.23%) వినియోగించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో సాధారణ పరిపాలనా ఆస్తుల కల్పన కోసం రూ.2,343.64 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. గత 6 నెలల్లో రూ.432.10 కోట్లు (18.44%) మాత్రమే ఖర్చు చేసింది. పాఠశాలలు, దవాఖానలు, వసతి గృహాల నిర్మాణం లాంటి సామాజిక మౌలిక వసతుల కోసం కేటాయించిన రూ.19,214.83 కోట్లలో ఇప్పటివరకు ఖర్చు పెట్టింది కేవలం రూ.5,747.46 కోట్లే. అంటే 70 శాతానికిపైగా నిధులు నిరుపయోగంగా మారాయి.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

