బ్రెయిన్ క్యాన్సర్ బాధితుడికి కేటీఆర్ భరోసా
బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న కర్నె వినయ్(13)కు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు.
- మెరుగైన వైద్యానికి సాయం చేస్తానని హామీ
- కేటీఆర్ సూచనతో సింధు దవాఖానలో చేరిక
హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న కర్నె వినయ్(13)కు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నరసింహులగూడెం గ్రామానికి చెందిన కర్నె ఆదినారాయణ- అనిత కుమారుడు వినయ్ కొంతకాలంగా బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు.
పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ చొరవతో బాలుడు శనివారం హైదరాబాద్‌లో కేటీఆర్‌ను కలిశాడు. వినయ్‌తో కేటీఆర్ ఆప్యాయంగా మాట్లాడి, అతని ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. బాలుడి కుటుంబం ఆందోళన చెందవద్దని, వినయ్‌కు మెరుగైన వైద్యం అందించేందుకు అండగా ఉంటానని భరోసా ఇచ్చా రు. కేటీఆర్ సూచనల మేరకు వినయ్‌ను సిం ధు దవాఖానలో చేర్పించారు. తమ కుమారుడి వైద్యానికి అండగా నిలిచిన కేటీఆర్‌కు కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

