రఘుదత్ డేగల ది గ్రేట్!
వందేభారత్-2026లో గుర్తింపు పొందిన కైటెకి ఇన్నోవేషన్స్ వ్యవస్థాపకుడు రఘుదత్ డేగలను ‘ది గ్రేట్' అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- భవిష్యత్తులో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్ష
హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): వందేభారత్-2026లో గుర్తింపు పొందిన కైటెకి ఇన్నోవేషన్స్ వ్యవస్థాపకుడు రఘుదత్ డేగలను ‘ది గ్రేట్’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. దివ్యాంగుల జీవితాల్లో సౌలభ్యం, ఆత్మగౌరవం, స్వతంత్రతను పెంపొందించే వినూత్న సాంకేతిక పరిష్కారాల అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషిపై ప్రశంసలు కురిపించారు. రఘుదత్ డేగలను కేటీఆర్ శనివారం తెలంగాణ భవన్లో కలిసి సంతోషం వ్యక్తంచేశారు.
‘హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కైటేకి ఇన్నోవేషన్స్ వందే భారత్-2026లో 26,000కు పైగా దరఖాస్తుల్లో టాప్-10 ఆవిష్కర్తల్లో స్థానం సాధించడం..ఆహ్మదాబాద్లో నిర్వహించిన గ్రాండ్ ఫినాలేలో స్పెషల్ క్యాటగిరీ అవార్డ్స్-డిసెబిలిటీ కింద అవార్డుతో పాటు రూ.11 లక్షల నగదు బహుమతి అందుకోవడం ఎంతో గొప్పవిషయమని కొనియాడారు. సంస్థ రూపొందించిన కీలక ఆవిష్కరణ ‘గుకో బిడెట్’ వ్యక్తిగత పరిశుభ్రతను మరింత సులభతరం చేయడంతో పాటు, బహిరంగ మరుగుదొడ్లలో దివ్యాంగులు స్వయంగా వినియోగించుకొనేలా రూపొందించారని వివరించారు. చేతితో నిర్వహించగలిగే వెర్షన్తో పాటు, పాదాలతో పెడల్ ద్వారా పనిచేసే వెర్షన్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారని వెల్లడించారు.
పారిశ్రామికవేత్తగా, దివ్యాంగుల హకులుసమ్మిళిత సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తున్న వ్యక్తిగా, శిక్షణ, కౌన్సెలింగ్, నాయకత్వ అభివృద్ధి రంగాల్లో 15 ఏండ్లకు పైగా అనుభవం కలిగిన రఘుదత్ తన వ్యక్తిగత అనుభవాల నుంచి స్ఫూర్తి పొందారని తెలిపారు. ఫోకోమీలియా అనే అరుదైన అవయవ అభివృద్ధి, తనకు ఎదురైన సవాళ్లను ఇతరులకు ఉపయోగపడే పరిషారాలుగా మార్చాలనే లక్ష్యంతో కైటెకి ఇన్నోవేషన్స్ ద్వారా కృషి చేయడం గొప్ప విషయమని కొనియాడారు. సమాజంలోని ప్రతి ఒకరికీ సమాన అవకాశాలు, స్వతంత్ర జీవనం, గౌరవప్రదమైన జీవన ప్రమాణాలు అందేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలనే ఆయన ప్రయత్నాలు మరింత విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

